Monday, June 24, 2024

భర్త మరణాన్ని తట్టుకోలేక.. మహిళ సూసైడ్

spot_img

రంగారెడ్డి: నార్సింగి హైదర్ షాకోట్ లో విషాదం చోటుచేసుకున్నది. భర్త మరణాన్ని తట్టుకోలేక లక్ష్మీ అనే మహిళ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలం క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. భర్త చనిపోవడంతో మహిళ ఒంటరిగా జీవనం‌ సాగిస్తున్నది. గురువారం ఉదయం ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళ్లగానే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన 1వ తరగతి, 3వ తరగతి చదువుతున్న చిన్నారులు అనాథలుగా మారారు.

Latest News

More Articles