Saturday, May 4, 2024

యాక్సిడెంట్ చేశానని భయపడి యువకుడు ఆత్మహత్య

spot_img

హైదరాబాద్ లో విషాధ ఘటన జరిగింది.  రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్ బి నగర్ లో జరిగింది. వనస్థలిపురం FCI కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో ఎల్ బి నగర్ నుంచి బయల్దేరిన రితీష్…..మూసారంబాగ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి రితీష్ కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం. దీంతో రితీష్ రెడ్డి ప్రమాదం తర్వాత కారు ఆపకుండా అలానే వచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు రితీష్ రెడ్డి కారును బైక్ పై వెంబడించాడు. దీంతో రితీష్ రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.కొద్ది దూరం వెళ్లాక..ఎన్టీఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చి అక్కడ కారు పార్క్ చేశాడు.

అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై పోలీసులు కేసు పెడితే….జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే రితీష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతుడు గుమ్మడి రితీష్ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహం జరిగిందని..ఇంతలోనే ఈ విషాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఎల్ బి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రితీష్ రెడ్డిని వెంబడించిన ఇద్దరు వ్యక్తులు కోసం పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: రియాక్టర్ పేలి ఐదుగురి మృతి

Latest News

More Articles