Sunday, June 23, 2024

కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని.. ఉత్త కరెంట్ చేశారు..!

spot_img

మంత్రి హరీష్ రావు సమక్షంలో BRS లో కొల్లాపూర్ కు చెందిన అభిలాష్ రావు జాయిన్ అయ్యారు. ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డీ ,గువ్వల బాలరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్ లకు విలువ లేదు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.

అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ. కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని…ఉత్త కరెంట్ చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పనవి…చెప్పినవి చేసింది కేసీఅర్ మాత్రమే. కొల్లా పూర్ లో గులాబీ జెండా ఎగురేయాలి. మళ్ళీ వచ్చేది BRS గవర్నమెoటే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కేసీఅర్ హయాంలో కొల్లా పూర్ అభివృద్ధి చెందింది’ అని అన్నారు మంత్రి హరీష్ రావు.

Latest News

More Articles