Saturday, May 18, 2024

జావెలిన్‌ త్రోలో  గోల్డ్ మెడల్  సాధించిన నీరజ్ చోప్రా

spot_img

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న మొదటి ఇండియన్ గా నిలిచాడు. హంగేరిలోని బుడాపెస్ట్ లో జరిగిన అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నీరజ్‌ 88.17 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి… ఈ చారిత్రాత్మక ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ కి రజత పతకం రాగా… చెక్‌ కాంస్యం సొంతం చేసుకుంది.

గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో రజతం గెలుచుకున్ననీరజ్..లేటెస్టుగా  గోల్డ్ మెడల్ తో అన్ని ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో  ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్‌ ఖాతాలో మూడు బంగారు పతకాలు చేరాయి. అయితే ఈ మూడు మెడల్స్ లో రెండు నీరజ్‌ సాధించాడు.

Latest News

More Articles