Saturday, May 18, 2024

టీఎస్‌ సెట్‌ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ

spot_img

తెలంగాణలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్‌ సెట్‌-2023 పరీక్ష క్వశ్చన్ పేపర్ ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైంది. అయితే, ఈ కీపై అభ్యంతరాల స్వీకరణ మొదలైంది.  ఇవాళ(మంగళవారం) నవంబర్‌ 7న మధ్యాహ్నం 1గంట నుంచి ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన లింక్‌ అందుబాటులోకి వచ్చింది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ http://telanganaset.org  ఈ లింక్‌ పై క్లిక్‌ చేసి.. తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీతో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. అయితే, తగిన సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు తెలిపేందుకు వీలుగా ఈ లింక్‌ గురువారం (నవంబర్‌ 9) మధ్యాహ్నం 1గంట వరకు అందుబాటులో ఉండనుంది.

ఇది కూడా చదవండి: మీ ఓటు ఐదేండ్ల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుంది

Latest News

More Articles