Saturday, May 18, 2024

నాయ‌కుల‌ను సంతలో ప‌శువుల‌ను కొన్న‌ట్టు మాదిరిగా కొంటారా..?

spot_img

దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్..అధికార పార్టీకి చెందిన నాయ‌కుల‌ను సంతలో ప‌శువుల‌ను కొన్న‌ట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి, 58 ఏండ్లు మ‌న గోస పోసుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: మీ ఓటు ఐదేండ్ల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుంది

అంతేకాదు.. ఈ దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు గ‌డుస్తుంది. మ‌న దేశంలో ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌లో ఉండాల్సిన రాజ‌కీయ ప‌రిణితి లేదు. చాలా త‌క్కువ ఉంది. రాజ‌కీయ ప‌రిణితి లేక‌పోవ‌డంతో ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం ల‌క్ష‌ల‌ కోట్లు పెట్టి సంత‌లో ప‌శువుల్లా మాదిరి నాయ‌కుల‌ను కొన‌డం జ‌రుగుతోంది. ఇది స‌రికాదు. అబ‌ద్దాలు, ప‌నికిమాలిన ఆరోప‌ణ‌లు జ‌రుగుతాయి. ఇవ‌న్నీ అధిగ‌మించాలంటే రాజ‌కీయ ప‌రిణితి పెర‌గాలి. అలా రాజ‌కీయ ప‌రిణితి పెరిగిన దేశాల్లో పేద‌రికం, ద‌రిద్రం పోతున్నాయి. మ న‌దేశంలో కూడా రావాలి. ప్ర‌జ‌లు గెలిచేట‌టువంటి ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ రావాలి. ప్ర‌జ‌స్వామ్య దేశంలో వ‌జ్రాయుధం ఓటు. ఆ ఓటు మీ త‌ల‌రాత‌ను మారుస్త‌ది. ఆషామాషీగా నాలుగు పైస‌ల‌కు ఆశ‌ప‌డి ఓటు వేయొద్దు. మ‌న త‌ల‌రాత‌ను లిఖించే ఓటును జాగ్ర‌త్త‌గా ఆలోచించి ఓటేయాలి. అందుకే నేను కోరేది ఏంటంటే.. ఆగ‌మాగ‌మై ఓట్లు వేయొద్దు. మీరు ఊరికి పోయిన త‌ర్వాత మీ ఊర్ల‌లో చ‌ర్చ చేయాలి. కేసీఆర్ మాట‌ల‌పై ప‌ది మందిని పోగేసి చ‌ర్చ చేయాల‌ని కేసీఆర్ సూచించారు.

మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌ రోడ్డును ఎవరూ పూర్తి చేయలే. పుట్ట మధు వచ్చినంకనే నా వెంటపడి దాన్ని పూర్తి చేసిండని తెలిపారు సీఎం కేసీఆర్. అనేక గ్రామాలకు రోడ్లు లేకుండె. నదుల మీద బ్రిడ్జిలు లేకుండె.. నా వెంటపడి కొన్ని వందల కిలోమీటర్లకు రోడ్లు వేయించిండు. పలిమెల, పంకెన లాంటి మారూమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించిన ఘనత పుట్ట మధుది. ఆయన ఎంత చేయాల్నో అంత చేసిండు. కానీ మీరే ఆయన పని చేసిండ్రు. నిజమా.. కాదా..?’ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించడంపై సీఎం ప్రశ్నించారు. ఈ సారి పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి:బాల్క సుమ‌న్ ను భారీ మెజార్టీతో గెలిపించండి

Latest News

More Articles