Saturday, May 18, 2024

సముద్రం మధ్యలో పెళ్లి చేసుకున్న దగ్గుబాటి అభిరామ్

spot_img

సినీ నిర్మాత సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ వివాహం బుధవారం రాత్రి జరగింది. నిన్న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో వివాహ వేడుక నిర్వహించారు. అక్కడ సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్‌లో పెళ్లి వేడుక ఏర్పాటు చేశారు. తనకు వరుసకు మరదలయ్యే ప్రత్యూష చాపరాలను ఆయన పెళ్లాడారు. అభిరామ్ చిన్న తాత కూతురికి కూతురు ఈ ప్రత్యూష. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్‎లో జరిగింది. హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలను నగరంలోనే నిర్వహించారు. ఇక ఈ వివాహ వేడుక కోసం ద‌గ్గుబాటి కుటుంబ‌మంతా శ్రీ‌లంక వెళ్ల‌గా.. 200 మంది అతిథులు పెళ్లికి హాజరయ్యార‌ని సమాచారం. పెళ్లి తరువాత ఇరు కుటుంబాల వారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది.

Read also: ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

Latest News

More Articles