Sunday, May 19, 2024

మీ ఓటు నాకే వేయాలంటూ హీరో నాని ప్రచారం.. పోటీ ఎక్కడో తెలుసా?

spot_img

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హిట్ నడుస్తోంది. ఎన్నికల సమరం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ నేతలు ఏ ఫ్లాట్ ఫామ్‎ను కూడా వదలకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం ప్రచారంలోకి దిగారు. మీ ఓటు తమకే వేసి గెలిపించాలని కోరుతున్నాడు.

Read Also: 15 ఏళ్లకే అమ్మ.. 33 ఏళ్లకు అమ్మమ్మ.. ఇప్పుడు మరో ప్రేమ పెళ్లి

ఇదేంటి నాని ఎక్కడి నుంచి పోటీచేస్తున్నాడా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయం ఏంటంటే.. నాని, మృణాల్ ఠాకూర్ నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని, మృణాల్.. దేన్నీ వదలకుండా సినిమా గురించి హైప్ ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగానే రాజకీయ నాయకుడి గెటప్ వేసి తమ సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాడు.

Read Also: వరల్డ్ కప్ అంటే మామూలుగా ఉండదు మరి.. టీవీల్లో 10 సెకన్ల ప్రకటనకు రూ.35 లక్షలు

తాజాగా నాని తన ట్విట్టర్‎లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. రాజకీయ నాయకుడిలా రెడీ అయ్యి.. ప్రచారానికి వెళ్ళినప్పుడు దండం పెట్టి అడిగినట్లు అందరినీ కోరాడు. ‘రాష్ట్రం అంతటా ఎన్నికల వాతావరణం ఉంది. మరి ఆ ప్రచారంలో నేను కూడా ఎందుకు చేరకూడదు.. డిసెంబర్ 7న మీ ప్రేమ మరియు ఓటు మాకే వెయ్యాలి. మీ హయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్. కొన్ని సరదా ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తాం’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

Latest News

More Articles