Sunday, May 19, 2024

కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందన

spot_img

కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించింది. ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది జ్యోతి. కేపీ చౌదరితో తనకు కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్‌తో సంబంధం లేదు.

ఏ విచారణకు అయినా తాను సిద్ధంమే. నా ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేసింది జ్యోతి. డేటా రిట్రీవ్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదు. ఎప్పుడూ డ్రగ్ కన్ఫ్యూమ్ చేయలేదు, ఏ తప్పు చేయలేదు, భయపడేదిలేదు. తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరింది.

Latest News

More Articles