Sunday, May 19, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేకుండానే ప్రవేశాలు

spot_img

ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శుభవార్త చెప్పింది. ఇకపై ఎంఈ, ఎంటెక్ కోర్సులకు ప్రవేశపరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఈ నేపథ్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (పీజీఈ సెట్‌)లో కొన్ని పరీక్షలు రద్దు కానున్నాయి. వీటిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

Read Also: తండ్రిని చంపిన వ్యక్తిని వెంటనే వెంటాడి చంపిన కొడుకు

పరీక్షల్లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, పీజీఈసెట్‌ పూర్వ కన్వీనర్‌ రవీంద్రారెడ్డి ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫారసులు చేయనుండగా, వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలకు ఆమోదిస్తే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024 -25 సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈ-సెట్‌ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తుండగా, పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉండటం.. ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతోనే ఈ దిశగా అడుగులేస్తున్నారు.

Latest News

More Articles