Tuesday, May 7, 2024

సాగర్‎లో ఏపీ ప్రభుత్వం దుస్సహాసం చేసింది

spot_img

నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం దుస్సహాసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ‘ఏపీ ప్రభుత్వం దుస్సహాసం చేసింది. సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించడం దుర్మార్గపు చర్య. ఇది చాలా తీవ్రమైన అంశం.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ఆంధ్రా నిర్వహణలో, సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉంది. కానీ దురాక్రమణ చేస్తూ ఆంధ్రా ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం.

Read Also: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేకుండానే ప్రవేశాలు

రెండు రాష్ట్రాల ప్రజల సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉంది. దురాలోచనతో ఇది చేశారు. ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించింది. అయినా ఆంధ్రా పోలీసులు వెనక్కి పోవడం లేదు. ఆంధ్రాకు నీటి విడుదల కూడా కొనసాగుతుంది. రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయే విధంగా ఆంధ్రా ప్రభుత్వం కుట్ర చేసింది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు. రేపు ఎన్నికల కౌంటింగ్‎లో బీఆర్ఎస్ ప్రభంజనం వస్తుంది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావు.. కొన్నిసార్లు భూమరాంగ్ అవుతాయి’ అని గుత్తా అన్నారు.

Latest News

More Articles