Sunday, May 19, 2024

సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌లో రోజూ 2 గంటల విద్యుత్ కోతలు!

spot_img

హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. సమ్మర్ సీజన్‌లో విద్యుత్‎కు పెరిగే డిమాండ్‌ నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని ఆయన అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు.

వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలు ఉంటాయని ఎంపీ తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యమైనట్టు ఫారూఖీ పేర్కొన్నారు. ప్రజలకు కలిగే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆయన అన్నారు.

Read Also: గోదారోళ్లా మజాకానా.. కొత్త అల్లుడికి 300 వెరైటీ వంటకాలు

నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ట్విట్టర్ వినియోగదారుల ప్రశ్నలకు బదులిస్తూ ఆయన తెలిపారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Latest News

More Articles