Sunday, May 19, 2024

గోదారోళ్లా మజాకానా.. కొత్త అల్లుడికి 300 వెరైటీ వంటకాలు

spot_img

సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే హడావుడి మరెక్కడా ఉండదు. పండుగ మూడు రోజులు ఆటపాటలు, కోడిపందాలు, కమ్మని వంటకాలు, ఎద్దుల పోటీలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని అక్కడే ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి చేసే మర్యాదలు మామూలుగా ఉండవు. కొత్త అల్లుడు పండగకు ఇంటికొస్తే.. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా వండి పెడుతుంటారు. సంక్రాంతి పండుగకొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 300 రకాల వంటకాలు చేసి పెట్టారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా అనిపించారు.

Read Also: పండగపూట తాగిన మత్తులో వాచ్‎మెన్‎ను హత్యచేసిన తాపీ మేస్త్రీ

పండుగకు 50 వెరైటీలే ఎక్కువ అనుకుంటే ఏకంగా 300 రకాల వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చారు. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తన కుమార్తె రిషితకు విశాఖపట్నానికి చెందిన దేవేంద్రనాథ్‎కి ఇచ్చి ఈ మధ్యే వివాహం చేశారు. వారి పెళ్లి జరిగిన తర్వాత మొదటి పండుగ కావడంతో సంక్రాంతికి అల్లుడు అత్తారింటికి వచ్చాడు. ఇంకేముంది అతడికి గుర్తుండిపోయేలా, అంతా అదిరిపోయేలా ప్రేమచూపిస్తూ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా 300 రకాలకు పైగా వెరైటీలు చేసి పెట్టారు. ఆ వంటకాలన్నీ దగ్గరుండి మరీ తినిపించి అల్లుడికి మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ వెరైటీ వంటకాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Latest News

More Articles