Monday, May 20, 2024

ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం

spot_img

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతోంది. ఇవాళ(సోమవారం) ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. దీంతో గాలి పీల్చేందుకు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కూడా భ‌య‌ప‌డుతున్నారు. కాగా.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 322గా నమోదైందని సఫర్‌ తెలిపింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌, హసన్‌పూర్‌ డిపో, తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారి పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఫలితంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదంటున్నారు వాహనదారులు.

ఇది కూడా చదవండి: ఇక ట్యాంక్ బండ్ లోనే దసరా ఉత్సవాలు

Latest News

More Articles