Wednesday, May 8, 2024

ట్యాంక్ బండ్ మధ్యలో దసరా ఉత్సవాలు!

spot_img

మహబూబ్ నగర్ లో దసరా ముగింపు ఉత్సవాలకు ట్యాంక్ బండ్ మధ్యన ఉన్న ఐలాండ్ ను శాశ్వత వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. దసరా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి బోటులో చెరువును పరిశీలించారు. అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి ద్వారా ఐలాండ్ కు చేరుకుని అక్కడ శాశ్వతంగా ఉండేలా జమ్మిచెట్టును నాటారు. దసరా కట్టను నిర్మించడంతోపాటు శాశ్వతంగా ఉత్సవాలు, బాణాసంచా కార్యక్రమం అక్కడే కొనసాగుతుందన్నారు.

దసరా ఉత్సవ కమిటీ సూచనల మేరకు ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ట్యాంక్ బండ్ వద్ద స్వరలహరి కల్చరల్ అకాడమీ, దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాలతో పలు సాంస్కృతిక సంస్థల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రకాష్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles