Saturday, May 18, 2024

దీపావళికి పెరగనున్న విమాన ఛార్జీలు

spot_img

దీపావళికి విమాన చార్జీలు పెరగనున్నాయి.గతేడాదితో పోల్చితే ఈసారి ప్రయాణీకులు అదనంగా 90 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. నవంబర్‌ 10 నుంచి 16 మధ్య టిక్కెట్‌ బుకింగ్స్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది అక్టోబర్‌ 21 నుంచి 27 మధ్య దీపావళి పండుగ సీజన్‌ వచ్చింది. ఈ సమయంలో ఢిల్లీ-శ్రీనగర్‌ రూట్‌ విమాన టిక్కెట్‌ ధర రూ.3,794 గా ఉంది. కానీ ఈ నవంబర్‌ 10-16 మధ్య ఈ రూట్‌ విమాన ప్రయాణం రూ.7,175 పలుకుతోంది. 89.11 శాతం పెరిగింది. ఢిల్లీ-హైదరాబాద్‌, బెంగళూరు-హైదరాబాద్‌ విమాన చార్జీలూ 34 శాతం నుంచి 63 శాతం వరకు ఎగబాకాయి. ఫలితంగా ఈ పండుగకు విమానాల్లో వెళ్లాలనుకునేవారు పునరాలోచనలో పడుతున్నారు.

దేశంలోని మెట్రో నగరాలేగాక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విమాన చార్జీలు పెరిగాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూర్ల నుంచి భువనేశ్వర్‌, ఇండోర్‌, లక్నో, జైపూర్‌ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన చార్జీల్లో 5-15 శాతం మధ్య పెరిగినట్లు తెలుస్తోంది.

Latest News

More Articles