Saturday, May 4, 2024

ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌

spot_img

హైదరాబాద్‌: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ అన్నట్టుగానే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన దినచర్యను తెలుపుతూ.. ‘పుష్ప2’ లొకేషన్, షూటింగ్ కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.  రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘పుష్ప2’ షూటింగ్‌ సెట్స్‌ను ప్రత్యేకంగా చూపించాడు.

‘‘ఇతర దేశాల్లో కంటే భారత్‌లో అభిమానులు స్పెషల్. వాళ్ల ప్రేమను చెప్పడం కష్టం.’’  అని బన్నీ తన పోస్ట్ లో చెప్పారు. ‘పుష్ప2’  తనకు స్పెషల్ ప్రాజెక్టు అని, షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఆ వీడియోలో డైరెక్టర్ సుకుమార్‌ చెప్పారు. అల్లు అర్జున్‌ నిన్న సాయంత్రం తన ఇన్‌స్టాలో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles