Friday, May 3, 2024

అలర్ట్.. ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందులు.!

spot_img

ఆహార పదార్థాల్లో పురుగులు కనిపిస్తే అస్సలు సహించలేం.అలాంటి పురుగుల మందులు వాడుతున్నట్లు తెలుస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే సింగపూర్‌లో చోటుచేసుకుంది. ఇది ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలా. ఈ ఉత్పత్తిని రీకాల్ చేయాలని సింగపూర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మసాలా దినుసులో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఒక రకమైన పురుగుమందు.ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరెస్ట్ స్పైసెస్ దిగుమతిదారు SP ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రీకాల్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. అంటే సింగపూర్ మార్కెట్‌లో ఈ మసాలాను విక్రయించలేం. దాన్ని తిరిగి భారత్‌కు పంపిస్తామని తెలిపారు.

ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ఏమిటి?
సూక్ష్మజీవుల కాలుష్యాన్ని నివారించడానికి వ్యవసాయ ఉత్పత్తులకు ఇథిలీన్ ఆక్సైడ్ ను పిచికారి చేస్తారు. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ప్రకారం, ఈ రసాయనాన్ని ఆహార పదార్థాలలో ఉపయోగించేందుకు అనుమతి లేదు. “సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం, సుగంధ ద్రవ్యాల స్టెరిలైజేషన్‌లో ఇథిలీన్ ఆక్సైడ్‌ను ఉపయోగించడానికి అనుమతి ఉంది” అని ఏజెన్సీ చెబుతోంది.

ఆరోగ్య సంబంధిత సమస్యలు:
ఇథిలీన్ ఆక్సైడ్‌ను ఆహారం ద్వారా తక్కువ పరిమాణంలో తీసుకుంటే, వెంటనే ప్రమాదం లేదని SFA చెబుతోంది. కానీ దీర్ఘకాలం ఎక్స్పోజర్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. “ఇలాంటి కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేదు. అయితే, ఈ పదార్ధం వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.ఆహార సంస్థ సలహా ప్రకారం “కలుషితమైన ఉత్పత్తిని కొనుగోలు చేసిన వినియోగదారులు దానిని తినకూడదని గట్టిగా సలహా ఇస్తున్నారు. అదనంగా, ప్రభావితమైన ఉత్పత్తులను వినియోగించిన, ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వైద్యులను సంప్రదించవలసిందిగా కోరారు. అయితే ఈ వార్త పై ఇప్పటికీ ఎవరెస్టు సంస్థ స్పందించలేదు.

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు సుందర్ పిచ్చాయ్ వార్నింగ్.!

Latest News

More Articles