Friday, May 3, 2024

ఏపీ, తెలంగాణకు వర్షసూచన..తగ్గనున్న ఎండలు.!

spot_img

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. నిన్న ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ కొన్ని జిల్లాలో భారీ వర్షం పడింది. అరేబియా నుంచి మేఘాలు వేగంగా తెలంగాణవైపు రాకపోవడంతో నిన్న ముంబైలో వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ లో కురవాల్సిన వర్షం కురవకుండా పోయింది. మేఘాలు వచ్చిన అనుకున్నంత చల్లదనం మాత్రం లేదు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. ఏపీ మాత్రం నిన్నటితో పోల్చితే ఇవాళ కాస్త చల్లబడింది. మరి ఇవాళ్టి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

ఇవాళ్టి నుంచి రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. అందుకేకొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయనీ..గాలులు వేగంగా గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీస్తాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, కొమురంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, పెద్దపల్లి, సిద్ధిపేట ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

నేడు ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచే మేఘాటు ఉంటాయని ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లో పలు చోట్ల చిరు జల్లులు కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం 2గంటలకు రెండు రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలు కమ్ముకుంటాయని తెలిపింది. అలాగే ఉత్తరతెలంగాణ, ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఆ తర్వాత రోజంతా మేఘాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు సుందర్ పిచ్చాయ్ వార్నింగ్.!

Latest News

More Articles