Friday, May 3, 2024

యూపీ రాజకీయాల్లో తెలుగు మహిళ..ఎవరీ శ్రీకళారెడ్డి.!

spot_img

యూపీ రాజకీయాల్లో తెలుగు ఆడబిడ్డ కలకలం రేపుతున్నారు. జౌన్ పూర్ స్థానం నుంచి బీఎస్పీ తరపున బరిలోకి దిగిన శ్రీకళా రెడ్డి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో 2004లో కోదాడ నుంచి టీడీపీ తరపున 2019లో బీజేపీ తరపును హుజురాబాద్ నుంచి బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా యూపీలో తన భర్త ధనుంజయ్ సింగ్ కు జైలు శిక్ష పడటంతో ఆమె బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన కీసర జితేందర్ రెడ్డి ఏకైక కూతురు శ్రీకళా రెడ్డి. నిప్పో బ్యాటరీ కంపెనీ వీరి కుటుంబానిదే. చెన్నై కేంద్రంగా వ్యాపారంసాగడంతో శ్రీకళారెడ్డి ఇంటర్మీడియేట్ అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసి అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. 2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో యూపీకి చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ శ్రీకళను మూడో భార్యగా వివాహం చేసుకున్నాడు. మొదటిభార్య ఆత్మహత్య చేసుకోగా..రెండు భార్యకు విడాకులు ఇచ్చి శ్రీకళా రెడ్డిని మూడో భార్యగా స్వీకరించాడు.

2021లో జౌన్ పూర్ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికై జడ్పీ చైర్మన్ గా శ్రీకళారెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టింది. కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో ధనుంజయ్ సింగ్ జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. దీంతో బీఎస్పీ శ్రీకళారెడ్డిని బరిలోకి దించింది. బీజేపీ, ఎస్పీలను తట్టుకుని ఆమె ఎంతవరకు విజయం సాధిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే శ్రీకళారెడ్డి పేరు మీద రూ. 780రకోట్ల స్థిరాస్తులు, 6.71కోట్ల చరాస్తులు, 1.74కోట్లఆభరణాలు ఉండగా భర్త ధనుంజయ్ పేరు మీదకూడా భారీగానే ఆస్తులు ఉండటం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణకు వర్షసూచన..తగ్గనున్న ఎండలు.!

Latest News

More Articles