Friday, May 3, 2024

అమిత్ షాకు సొంత కారు లేదట..పైగా 15లక్షల అప్పులు..!

spot_img

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం గాంధీ నగర్‌లో రోడ్ షో అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గాంధీ నగర్ లోక్‌సభ స్థానం బిజెపికి సాంప్రదాయక స్థానం. ఈ స్థానంపై బీజేపీ నిరంతరం విజయాన్ని నమోదు చేస్తోంది. మే 7న మూడో దశలో ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అమిత్ సా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు అంటే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మూడోసారి అధికార పగ్గాలు అప్పగించడమేనన్నారు.

అమిత్ షాకు సొంత కారు లేదు:
నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి అమిత్ షా అఫిడవిట్ వార్తల్లో నిలుస్తోంది. ఈ అఫిడవిట్ ప్రకారం అమిత్ షాకు సొంత కారు లేదు. అయితే ఆయనకు రూ.20 కోట్ల చరాస్తులు, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వ్యవసాయం కూడా వృత్తిగా చేస్తున్నాడు. అతనికి మొత్తం రూ. 15.77 లక్షల రుణం ఉంది. ఇల్లు, భూమి ద్వారా వచ్చే అద్దె ఆదాయం, ఎంపీగా ఆయన పొందుతున్న జీతమే ఆయనకు ఆదాయ వనరుగా పేర్కొన్నారు.

అఫిడవిట్ వివరాలు:
మొత్తం ఆస్తులు 36.65 కోట్లు
చరాస్తులు-20.33 కోట్లు
స్థిరాస్తి విలువ -16.31 కోట్లు
రుణం- రూ. 15.77 లక్షలు
నగదు రూ.24,164
2022-23లో ఆదాయం – రూ. 75.09 లక్షలు
వృత్తి- వ్యవసాయం, సామాజిక సేవకుడు
ఆదాయ మూలం : ఎంపీ జీతం, ఇల్లు, భూమి నుండి అద్దె, వ్యవసాయ ఆదాయం వాటా డివిడెండ్ ఆదాయం.

శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12:39 గంటలకు అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయాన్ని ‘విజయ్ ముహూర్తం’గా పరిగణిస్తారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: యూపీ రాజకీయాల్లో తెలుగు మహిళ..ఎవరీ శ్రీకళారెడ్డి.!

Latest News

More Articles