Monday, June 24, 2024

రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలి: హరీశ్ రావు

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరిచిందని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమియల్ మండల్ పూడూరు గ్రామం లోని వడ్ల కొలుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం రైతులతో మాట్లాడారు.కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చేస్తున్నామని, ప్రభుత్వం గానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు అని చెప్పారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు.ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేసి…ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతామని.. .అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలని హరీశ్ రావు రైతులకు సూచించారు. ష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు ఇబ్బంది లేకుండా మూడు రోజుల్లోనే వడ్లను కొంటున్నామని, తడిసిన కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. రమేష్ అనే రైతు..లక్ష్మారెడ్డి అనే రైతులు నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు. రాత్రి వర్షం పడి సంచులన్నీ తడిచిపోయినయ్యాన్నారు.చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తింది.ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది.ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి నెలకుందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ సంచలన ట్వీట్.!

Latest News

More Articles