Monday, May 13, 2024

జాహ్నవి మృతిపై క్షమాపణ చెప్పిన అమెరికా మేయర్‌

spot_img

వాషింగ్టన్‌: అమెరికాలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టడంతో భారతీయ విద్యార్థిని జాహ్నవి మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాదానికి కారణమైన సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ ఆమె మరణంపై ఎగతాళిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. దీనిపై ప్రవాస భారతీయులు మండిపడ్డారు.

Also Read.. సుభిక్ష తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన

జాహ్నవి మృతి గురించి పోలీస్‌ అధికారి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీటెల్‌ మేయర్‌ బ్రూస్‌ హారెల్‌ క్షమాపణ కోరారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల.. నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీలోని సీటెల్‌ క్యాంపస్‌లో మాస్టర్స్ ఢిగ్రీ చదువుతున్నది. కాలేజీ నుంచి ఇంటికి వస్తుూ.. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా.. పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

Latest News

More Articles