Saturday, May 18, 2024

విషాదం..అమెరికాలో భారత జర్నలిస్టు దుర్మరణం.!

spot_img

అమెరికాలో విషాదం నెలకొంది. న్యూయార్క్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ యువ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో జరిగింది. జర్నలిస్టు డెడ్ బాడీని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..భారత్ కు చెందిన ఫాజిల్ ఖాన్ దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసేందుకు 2020లో న్యూయార్క్ కు వెళ్లాడు. అక్కడకొలంబియా జర్నలిజం స్కూల్లో కోర్సు పూర్తి చేశాడు.అక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం తన అపార్ట్ మెంట్ లో ఉన్న ఓ ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనంలోని లిథియం అయాన్ బ్యాటరీలో మంటలు ఎగిసిపడ్డాయి. అవివేగంగా వ్యాపించి భారీ అగ్నిప్రమాదానికి కారణం అయ్యింది.

ఈ ప్రమాదంలో పాజిల్ ఖాన్ మరణించాడు. కొందరు కిటికిల్లో నుంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ఘటనలో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై భారత కార్యాలయం స్పందించింది..ఫాజిల్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఫాజిల్ కుటుంబం, స్నేహితులతో టచ్ లో ఉంటున్నామని..ఫాజిల్ శవాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: నేడు గురుకుల జేఎల్, డీఎల్ ఫలితాలు వెల్లడి..!!

Latest News

More Articles