Saturday, May 18, 2024

75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహం

spot_img

ఇప్పటికే 8 గిన్నిస్ రికార్డులను సాధించిన శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తాజాగా మరో కొత్త కళాఖండాన్ని రూపొందించింది. 75 వేల వజ్రాలతో అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని తయారుచేసింది. ఈ ప్రతిమను హైదరాబాద్‎లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ శ్రీమతి సుధా రెడ్డి ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ మాస్టర్ పీస్‎ను ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో (IIJS) 2023లో అధికారికంగా విడుదల చేయగా, అక్కడ ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. కేరళలోని తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య విగ్రహం నుండి ప్రేరణగా తీసుకొని ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం 8 అంగుళాల ఎత్తు, 18 అంగుళాల పొడవు కలిగి ఉంది. దాదాపు రెండు నెలల పాటు 32 మంది స్వర్ణకారులు ప్రతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేసిన దీని బరువు 2.8 కిలోలు. ఈ విగ్రహ తయారీలో 500 క్యారెట్ల బరువు కలిగిన దాదాపు 75,000 వజ్రాలను ఉపయోగించారు.

శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ ఈ మైలురాయిని చేరుకున్నందుకు తన ఆనందం వ్యక్తీకరించారు. ప్రతిమను ప్రారంభించినందుకు శ్రీమతి సుధా రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శివ్ నారాయణ్ జ్యువెలర్స్ చైర్మన్ కమల్ కిషోర్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ శ్రీమతి సుధా రెడ్డి, మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు.

Latest News

More Articles