Sunday, May 19, 2024

పెళ్లిపై యాంకర్ ప్రదీప్ క్లారిటీ.. అమ్మాయి ఎవరంటే..!!

spot_img

యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇండస్ట్రీలో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం.

ప్రదీప్ మాచిరాజు టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దూసుకెళ్తున్నాడు. యాంకర్స్ గ్రూపులో సుమ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న యాంకర్ ప్రదీప్. మెయిల్ యాంకర్స్ లో ఎంతో మంది ఉన్నా..ప్రదీప్ ఒక్కరే టాప్ లో ఉంటాడు. ఎంతో మంది యాంకరింగ్ లోకి వచ్చారు..వెళ్లిపోయారు. కానీ ప్రదీప్ మాత్రం చాలా ఏళ్లుగా ఈ ఫీల్డ్ లోనే పాతుకుపోయారు. ప్రదీప్ పెళ్లి గురించి ప్రత్యేకంగా ప్రొగ్రామ్స్ పెట్టారంటే ప్రదీప్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అమ్మాయిల్లో ప్రదీప్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ట్యాగ్ కూడా వేయించుకున్నవారిలో ప్రభాస్ తర్వాత ప్రదీప్ కూడా ఆ పాపులారిటీని దక్కించుకున్నాడు.

అయితే ప్రదీప్ పెళ్లి గురించి గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏదొకటి నిజం కాలేదు. మంచు లక్ష్మీ టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో ప్రదీప్ కనిపించారు. తన చిన్ననాటి ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నాడట. ఆమెనే పెళ్లి చేసుకుంటాడట. కానీ అందుకు కొన్ని అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ అమ్మాయితో పెళ్లి జరగకపోతే మనోడు జీవితాంతం బ్యాచిలర్ గానే ఉండేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ప్రదీప్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. 38ఏళ్ల వయస్సున్న ప్రదీప్ 40లోకి అడుగు పెట్టబోతున్నాడు. మరి ఈ లోపు పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: అసూస్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్…త్వరలోనే లాంచ్..ధర, ఫీచర్లు ఇవే..!!

Latest News

More Articles