Saturday, May 18, 2024

కశ్మీర్ వీధుల్లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్..వీడియో వైరల్..!!

spot_img

చాలా మంది ఆటగాళ్లు భారత క్రికెట్ జట్టులో రిటైర్మెంట్ కూడా తీసుకున్నా..కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం క్రికెట్ అభిమానుల గుండెల్లో జీవితాంతం నిలిచిపోతుంటారు. అలాంటి ఆటగాళ్లు క్రికెట్ జట్టు నుండి రిటైర్ అయినప్పటికీ, నేటికీ వారి అభిమానులు వారిని ప్రశంసిస్తూనే ఉంటారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ ను క్రికెట్ దేవుడు అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అతని కొత్త వీడియో వైరల్ అవుతోంది. కొందరు స్థానికులు రోడ్డుపై క్రికెట్ ఆడుతుండగా వారిని చూసిన సచిన్ టెండూల్కర్ కారు దిగిన ‘ఆడదామా?’ అని అడిగాడు. సచిన్ ను చూసి షాక్ అయిన అక్కడివారు సచిన్ కు బ్యాట్ ఇచ్చారు. వారితో కలిసి సచిన్ సరదాగా క్రికెట్ ఆడారు. ఈ వీడియో గుల్ మార్గ్ కు సంబంధించింది.


ఈ వీడియోను సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (ఇంతకు ముందు ట్విట్టర్)లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ, ‘క్రికెట్ అండ్ కాశ్మీర్: స్వర్గంలో మ్యాచ్’ అని రాశాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని ఇతర హ్యాండిల్స్‌లో కూడా వేలాదిమంది షేర్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత ఒక నెటిజన్ దేవుడు స్వర్గంలో క్రికెట్ ఆడుతున్నాడు అంటూ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ వావ్ సచిన్ పాజీ, మీరు గొప్పవారు అంటూ కామెంట్ చేయగా.. సచిన్ బ్యాట్ నుండి దూరంగా ఉండలేడు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇది కూడా చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..అమ్మాయి ఎవరంటే..!!

Latest News

More Articles