Sunday, May 5, 2024

గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ అరెస్ట్..!!

spot_img

ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. తన నివాసంలో అన్నతోపాటు గంజాయి తాగుతూ కనపించడంతో పోలీసులు అరెస్టు చేశారు. మౌనిక అనే యువతిని ప్రేమించిన సంపత్ మరొక అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు. దీంతో మౌనిక మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లగా..అక్కడ తన ఫ్లాట్లో షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. షణ్ముఖ్ ను చూసి షాక్ అయిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ మౌనిక వీడియో తీస్తుంటే అడ్డుకున్నట్లు సమాచారం. గతంలో షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: అసూస్ నుండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్…త్వరలోనే లాంచ్..ధర, ఫీచర్లు ఇవే..!!

Latest News

More Articles