Saturday, May 18, 2024

జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

spot_img

సెక్స్ కుంభకోణం కేసులో ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో జేడీయూ నేత, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసు నమోదైంది. లేటెస్టుగా కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను దేవెగౌడ  ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతని అరెస్ట్ కు వ్యతిరేఖంగా రక్షణ కల్పించాలనే పిటిషన్‌ ను తిరస్కరించిన తర్వాత అరెస్ట్ జరిగింది.

తన తల్లిని రేవణ్ణ, అతని సహాయకులు కిడ్నాప్ చేశారని 20 ఏళ్ల యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రాజు ఫిర్యాదు తో రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. కిడ్నాప్‌ కేసులో రేవణ్ణ బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది.

ఆ మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న ఒక సారి.. ఏప్రిల్ 29న మరోసారి రేవణ్ణ పిలుస్తున్నాడంటూ  సతీష్ అనే వ్యక్తి ఆ మహిళను బలవంతంగా తీసుకెళ్లాడు. మొదటి సారి అదే రోజు ఇంటికి వచ్చిన మహిళ…రెండో సారి తర్వాత నుంచి కనిపించకుండా పోయింది.

ఇది కూడా చదవండి:అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు

Latest News

More Articles