Saturday, May 18, 2024

అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు

spot_img

ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వాతావరణం ఎదో తమకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నట్టు ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారని చెబుతూ హామీలు గుప్పిస్తున్నారన్నారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ లో తెలంగాణభవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..గెలిస్తే, అధికారం వస్తేనే చేస్తాం అని అంటున్నారు తప్ప… వచ్చేది మేమే కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం లేదన్నారు. రాష్ట్రం లో 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చింది..ఒక్క హామీ కూడా అమలు చేయ్యలేక పోతున్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడంలో ఆస్కార్ అవార్డు వస్తుందన్నారు.

100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీమ్ ల్లో ఒకటి, రెండు తప్పా మిగిలిన ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదన్నారు పొన్నాల లక్ష్మయ్య. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి..మళ్ళీ ఆగస్టు నెలలో చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలు 7 రోజులు ఉండగా ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు.

మరోవైపు రామ మందిరం పేరుతో సమాజాన్ని చీల్చే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు పొన్నాల. ఓట్ల కోసం రామమందిరాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటోందన్నారు. నల్ల చట్టాలు తెచ్చి కొన్ని వందల మంది రైతులను పొట్టన పెట్టుకుందని బీజేపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.పన్నులు ద్వారా వందల కోట్ల రూపాయలను పేద ప్రజల దగ్గర కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏండ్లలో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మిందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రచారానికి డబ్బుల్లేక పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

Latest News

More Articles