Saturday, May 18, 2024

ఎయిరిండియాలో ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే..!

spot_img

ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉంది. టాటాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా సంస్థ లగేజీ పాలసీని కూడా చేంజ్ చేశారు.

దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ట పరిమితిని ఎయిర్ ఇండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు మాత్రమే లగేజీ తీసుకెళ్లే అవకాశముంది. ఎకానమీ క్లాస్ లోని ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటి వరకు ఈ లిమిట్ 20 కేజీల వరకు ఉండేది.

ప్రభుత్వ సంస్థగా ఎయిర్ ఇండియా ఉన్న టైంలో ఉచిత లగేజీ పరిమితి 25 కేజీల వరకు ఉండేది. ఎయిర్ ఇండియా ను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఈ పరిమితిని 20 కేజీలకు తగ్గించింది. తాజాగా… మరో ఐదు కేజీలు తగ్గించింది. అంటే 15 కేజీలు మాత్రమే ఉచితంగా అనుమతించనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నిబంధన మే 2 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఎకానమీ క్లాస్ లోని ఫ్లెక్స్ కేటగిరీలో జర్నీ చేసే ప్రయాణికులు మాత్రం 25 కేజీల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో నిప్పుల కుంపటి..మరో నాలుగు రోజుల్లో 48డిగ్రీలకు చేరే ఛాన్స్.!

Latest News

More Articles