Saturday, May 18, 2024

రాష్ట్రంలో నిప్పుల కుంపటి..మరో నాలుగు రోజుల్లో 48డిగ్రీలకు చేరే ఛాన్స్.!

spot_img

రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు, వడగాలులు తోడయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కి అవుతున్నారు. ఈరోజు వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో నాలుగు రోజుల్లో 48 డిగ్రీలకు చేరే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటక రావాలని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.

ఇవాళ అత్యధికంగా జగిత్యాల అల్లిపూర్ లో 46.8 డిగ్రీలు, కరీంగనర్ జిల్లా వీణవంకలో 46.8 నల్లగొండ జిల్లా తెల్దేవారపల్లెలో 46.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 46.4, నిజామాబాద్ జిల్లా జకోరాలో 46.4, మంచిర్యాల జిల్లా నాస్ పూర్ లో 46.3 పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లిలో 46.1 కామారెడ్డి జిల్లా ఎలుపుగొండలో 45.6 జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు వెంకటేశ్ కుమార్తె

Latest News

More Articles