Saturday, May 18, 2024

బీజేపీ 10 ఏండ్లలో 26 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువకు నెట్టింది

spot_img

మోడీ ప్రభుత్వ విద్వేషపూరిత, ప్రజా వ్యతరేక విధానాల కారణంగా దేశ ప్రజల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. ఇవాళ(శనివారం) హైదరాబాద్ మఖ్డూమ్ భవన్ లో సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని.. ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని ఆరోపించారు.

మోడీ  ప్రభుత్వం 10 ఏండ్లలో 26 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువకు నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ. విభజించు, పాలించు ప్రణాళికతో ప్రధాని ఎన్నికల స్పీచ్ ల్లో రెచ్చగొడుతున్నారని  ఫైర్ అయ్యారు. సామరస్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య విద్యేషాలు రగిలించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీలు మహిళల మంగళ సూత్రాలు లాగేసుకుంటారని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.

ఇల్లు, సంసారం లేని మోడీ కి మంగళ సూత్రాల విలువ ఏమి తెలుసునని ఆరోపించారు నారాయణ. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు అడ్డగోలుగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్  ఎజెండాను అమలు చేయడానికి బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని కోరారు సీపీఐ నారాయణ.

ఇది కూడా చదవండి:ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

Latest News

More Articles