Saturday, May 18, 2024

ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

spot_img

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే నియోజకవర్గంలో పోటీచేయడాన్ని నిషేధం విధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను విచారించలేమంది. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటామని పిటిషన్ దారులను ప్రశ్నించింది. ఎవరైనా రాహుల్‌గాంధీ, లాలూప్రసాద్‌ యాదవ్‌ వంటి పేర్లను పెట్టుకున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే వాళ్ల హక్కులను అడ్డుకున్నట్లే అవుతుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బకొట్టి తాము గెలిచేందుకు ఒకే పేరున్న అభ్యర్థులను రాజకీయ నేతలు వాడుకుంటున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని సాబు స్టీఫెన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రముఖ నేతలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఒకే పేరుండడంతో ఓటర్లు గందరగోలానికి గురవుతున్నారని, తమ అభిమాన నేతకు ఓటేయడానికి బదులు డూప్లికేట్ వ్యక్తులకు ఓటేస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా రాజకీయ నేతలు అనుసరిస్తున్న ఈ విదానాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేలా సమర్థమైన పరిశీలన, తగిన వ్యవస్థను తీసుకురావాలని అభ్యర్థించారు. అయితే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అడ్డంకి కాబోదని స్పష్టం చేస్తూ… సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించలేమని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: మాదిగలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలి

Latest News

More Articles