Saturday, May 18, 2024

క్రికెట్లో ధోనీ నాకు తండ్రిలాంటివారు..పతిరన కీలక వ్యాఖ్యలు.!

spot_img

యువక్రికెటర్లలో సత్తాను వెలికితీసి ప్రోత్సహించడంలో మాజీకెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందుంటాడు టిమిండియా తరపున కర్రాళ్లకు అవకాశాలు కల్పించిన అతడు..ఐపీఎల్ లోనూ సాధారణ జట్టుతో అధ్భుతాలు చేశాడు. కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నైను ఛాంపియన్ గా నిలిపాడు. ధోని కెప్టెన్సీలో రాటుదేలిన క్రికెటర్లలో మతీశా పతిరన కూడా ఉన్నాడు. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్ తో ఆకట్టుకున్న పతిరనకి ధోని ప్రతిసారీ సపోర్టుగా నిలిచాడు. ఈ క్రమంలో ధోనీ అందించిన ప్రోత్సాహంపై పతిరన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు.

నా తండ్రి తర్వాత..నా క్రికెట్ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్న ఏకైక వ్యక్తి ఎంఎస్ ధోనీ. ఎప్పుడూ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మానాన్న ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా ధోనీ అలా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా అది చెయ్, ఇది చెయ్ అని మరీ ఎక్కువగా చెప్పడు. అవసరమైన విషయాలను మాత్రమే సూటిగా చెబుతుంటాడు. ఆ మాటలే నాలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తోడ్పడతాయి. వినేందుకు చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ ప్రతీ మ్యాచులోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఏ అనుమానం ఉన్నా ధోనీని స్వేచ్చగా అడుగుతాను. అతడి నుంచి నాకు ఖచ్చితంగా మంచి సమాధానం వస్తుంది.

గత రెండు సీజన్ల నుంచి ధోనీ క్రికెట్ ఆడడని చెబుతున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ ఎడిషన్ లో అతడి ఫినిషింగ్ ను చూస్తున్నాం. వ్యక్తిగతంగా ఆ దూకుడైన ఆటను చూస్తుంటే చాలా సంతోషించాను. అందుకే ధోనీభాయ్ వచ్చే సీజన్ లో కూడా ఆడాలి. మాతో కలిసి మైదానంలో తిరగాలి. ప్రతి ఆటగాడిలోనూ నమ్మకం ఎలా కలిగించాలనేది ధోనీకి తెలిసినట్లు మరెవరికీ తెలియదు అని పతిరన చెప్పాడు.

ఇది కూడా చదవండి: రేపే నీట్ 2024 ప‌రీక్ష‌…ఒక్క నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ

Latest News

More Articles