Sunday, May 19, 2024

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసింది. అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరాను: కేసీఆర్

spot_img

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి చూసి బాధేసి..మళ్లీ పోరాటానికి బయలుదేరానని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ కు ఎంపీ ఎందుకు అంటున్నారు…నలుగురు బీజీపీ ఎంపీలు గెలిచారు ఒక్క పైసా అయినా తెలంగాణకు తీసువచ్చారా అంటూ బీజేపీ ఎంపీలపై ప్రశ్నల వర్షం కురిపించారు కేసీఆర్ . ఇక్కడి కరువు పరిస్థితులను చూసి వరద కాల్వను పునరుజ్జీ పథకంతో నీళ్లతో నింపామని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కాల్వను ఎందుకు ఎండబెడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలను జిల్లా చేసుకున్నాం కానీ రేవంత్ రెడ్డి తీసేస్తాని అంటున్నారని జిల్లా కావాలా వద్దా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సు యాత్ర రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ ను కేసీఆర్ పరిచయం చేశారు.

రైతు బంధ వచ్చిందా డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా..మరి సీఎం రేవంత్ రెడ్డి ఖాతాల్లో డబ్బులు జమ చేశానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రధాని మోదీ 15లక్షలు వేశారంట జగిత్యాలలో ఉన్నవారికి రాలేదా అంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, మభ్యపెట్టే మోసాలతో ఓట్లు దండుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రైతు బంధు ఐదెకరాలకు సీలింగ్ పెడతారట, 25ఎకరాలకు పెట్టాలని సూచించారు.

కాంగ్రెస్ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపాయారని కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా తాను కష్టపడ్డానని అన్నారు. ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని, అనేక సంస్థలు వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నాయన్నారు కేసీఆర్. ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టిన కేసీఆర్ వీణవంకలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందని అన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా వచ్చేది బీఆర్ఎసేనని.. అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా గెలుస్తామని అన్నారు. గోదావరి నీళ్లను మోదీ కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఈ ప్రతిపాదన పంపితే ముందుగా తెలంగాణ వాటా తేల్చాకే మీటింగ్ కు వస్తానని చెప్పినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఒకే పేరున్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

Latest News

More Articles