Saturday, May 18, 2024

బైజూస్​ రవీంద్రన్​‎పై ఈడీ లుక్ ​అవుట్​ నోటీసులు..ఎందుకంటే?

spot_img

బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ పై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులను ఈడీ అధికారులు కోరారు. హై స్టేక్స్ ఎక్స్ ట్రార్డినరీ జనరల్ మీటింగ్ కు ఒక రోజు ముందు ఈడీ ఈ నోటీసులు పంపించడం గమనార్హం. శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో కొంతమంది పెట్టుబడిదారులు రవీంద్రన్ ను ప్రస్తుతం కొనసాగుతున్న పదవిలో నుంచి బర్తరఫ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈజీఎం సమయంలో ఎలాంటి తీర్మానాలను ఆమోదించకూడదని..తుది విచారణ వరకు వేచి ఉండాలని బుధవారం కర్నాటక హైకోర్టు బైజూస్ వాటాదారులను కోరిన సంగతి తెలిసిందే షేర్ హోల్డర్ల సమావేశం నిర్వహించకుండా చూడాలని బైజూస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారన చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈజీఎం నిర్వహణపై న్యాయమూర్తి స్టే ఇవ్వకుండానే తదుపరి విచారణ మార్చి 13 వరకు వాయిదా వేశారు.

గతేడాదిలో రవీంద్రన్ కు చెందిన రెండు కార్యాలయాలతోపాటు ఆయన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఫెమా నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించి పలుకీలక పత్రాలతోపాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నామని అప్పట్లో ఈడీ తెలిపింది. కాగా రవీంద్రన్ కు ఈడీ ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన విచారణకు మాత్రం హాజరు కాలేదు.

ఇది కూడా చదవండి: గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ అరెస్ట్..!!

Latest News

More Articles