Tuesday, May 21, 2024

యాంకర్ శ్రీముఖి పెళ్లి.. అధికారిక ప్రకటన ?

spot_img

బిగ్ బాస్ 5 తరువాత శ్రీముఖి కెరీర్ టాప్ గేర్ లో దూసుకెళ్తుంది. రాహుల్ చేతిలో ఓడినా విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. కానీ తన ఫోకస్ మొత్తం టీవీషోస్ పైనే పెడుతూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలోను నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది శ్రీముఖి. ఫోటో షూట్స్, గ్లామర్ ఫొటోస్ తో యూత్ ని పిచ్చెక్కించే శ్రీముఖిపై తాజాగా సంచలన వార్త ఒకటి వైరల్ అవుతుంది. శ్రీముఖి పెళ్లి పీటలు ఎక్కబోతుందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలొస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ మెన్ తో ఎప్పటి నుండి శ్రీముఖి పీకల్లోతు ప్రేమలో ఉందని.. ఇరువైపులా పెద్దలని ఒప్పించి త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇక శ్రీముఖిని కట్టుకోబోయేవాడు బడా వ్యాపారవేత్త అట. కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ ఇంటికి శ్రీముఖి ఇల్లాలిగా వెళుతున్నారట.

అయితే ఒకప్పుడు శ్రీముఖి యాంకరింగ్ లో టాప్ 5 లో ఉండేది. ఇప్పుడు షోస్ పరంగానే ఆమెనే నంబర్ వన్. సుమ కూడా శ్రీముఖి చేస్తునన్ని షోలు చేయడం లేదు. గ్లామరస్ యాంకర్స్ కి డిమాండ్ పెరుగుతుండగా సుమ లాంటి వారు కూడా రేసులో వెనుక పడటంతో శ్రీముఖికి పోటీ లేకుండా పోయింది. అయితే కెరీర్ లో ఉన్నంత స్థాయిలో దూసుకెళ్తున్న శ్రీముఖి సడెర్న్ గా పెళ్లి చేసుకుంటే డిమాండ్ తగిపోతుందా అని కూడా అనుమానాలు వస్తున్నాయి. డాన్స్ ఐకాన్ వంటి ఓటీటీ షోస్ నిర్వాహకులు గ్లామర్ షోకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి పెళ్లి తరువాత ఎక్స్ పోజింగ్ అంటే ఇబ్బందులు వస్తాయేమో అంటున్నారు. అయితే ముగ్గురు బిడ్డల తల్లైన యాంకర్ అనసూయ చేయటం లేదా.. ఆమెకి లేని ఇబ్బందులు శ్రీముఖికి ఏంటని.. పెళ్లి వేరు వృత్తి వేరు అని మరికొందరు శ్రీముఖిని సమర్థిస్తున్నారు.

Latest News

More Articles