Wednesday, May 22, 2024

నాకేం తెలీకుండానే అయిపోయింది.. అశ్లీల చిత్రాలపై బండ్ల గణేష్ వివరణ..!

spot_img

పవన్‌ కళ్యాణ్ ని విపరీతంగా ప్రేమించే బండ్ల గణేష్ తేడా వస్తే కూడా అదే స్థాయిలో విరుచుకుపడతాడు. పవన్ తో గ్యాప్ వచ్చేలా చేస్తున్నాడన్న అనుమానంతో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటోళ్లని కూడా విమర్శించాడు బండ్ల గణేష్. నచ్చకపోతే ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, రవితేజ ఇలా ఎవర్నైనా తిట్టిపడేస్తాడు.. ఆ తరువాత సారీ కూడా చెప్పేస్తాడు. అయితే మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తన కోపాన్ని పరోక్షంగా చూపిస్తూ.. పవన్ కళ్యాణ్ ప్రతిభను తాను చాలా కాలం క్రితమే గుర్తించానని.. పవన్ సామాన్యుడు కాదని తనకు ముందే తెలుసని.. ఇప్పుడు గురూజీ, బరూజీలు వచ్చారని (పరోక్షంగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి) బండ్ల గణేష్ అన్నారు.

ఇక ఈ సందర్భంగా తన కెరీర్ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించటంపై కూడా స్పందించాడు బండ్ల గణేష్. నిజానికి అలాంటి సినిమాల్లో తాను నటించాలని అనుకోలేదని.. హీరో పాత్ర అని నిర్మాత నట్టి కుమార్ చెప్తే అలాంటి సినిమా ఒప్పుకున్నట్లుగా తెలియజేశాడు.అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదని.. బాడీని ఏదో పైకి కిందకి అంటే సరిపోతుంది అని ఏదో మాట్లాడి ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించాడు అని.. ముందే తెలిసి ఉంటే అలాంటి సినిమా చేయకపోయేవాడిని అని బండ్ల గణేష్ తెలిపాడు.

Latest News

More Articles