Saturday, May 18, 2024

ఏపీలోని ఆ గ్రామంలో నైటీలు వేసుకుంటే ఫైన్

spot_img

ప్రస్తుత కాలంలో మహిళలు, యువతులు వేసుకునే దుస్తుల విషయంలో కట్టుబాట్లు ఏం లేవు. ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలు వేసుకోవడం సర్వసాదారణమైపోయింది. కాగా.. గతంలో మన దేశంలోనే ఏదో ప్రాంతంలో నైటీలు వేసుకున్న ఆడవాళ్లకు జరిమానా విధించినట్లుగా వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు అలాంటి విచిత్రమైన వార్త మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. కాదు కుదరదని ఎవరైనా నైటీలు వేసుకుంటే రెండు వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు. పగలు నైటీలు వేసుకున్న వారి గురించి చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు.

Read Also: గంటలో ఆరుసార్లు భూకంపం.. 320 మంది మృతి

ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు, ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

మరిన్ని వార్తలు..

భార్యను హనీమూన్ తీసుకెళ్లి.. బెడ్ రూం వీడియోలు తీసి..

దసరా సెలవుల్లో మార్పు

Latest News

More Articles