Saturday, May 18, 2024

భార్యను హనీమూన్ తీసుకెళ్లి.. బెడ్ రూం వీడియోలు తీసి..

spot_img

అతడిని నమ్మి, కన్నవాళ్లను వదిలి అత్తారింట్లో అడుగుపెట్టింది. పెళ్లైన రెండు రోజులకే హనీమూన్ కోసం థాయ్‎లాండ్ వెళ్లింది ఆ జంట. అక్కడ ఓ వారం గడిపి, ఊరికొచ్చిన తర్వాత ఆ భర్తలోని రాక్షసుడు బయటకువచ్చాడు. హనీమూన్‎లో తనతో సరదాగా గడిపిన భార్య ఫోటోలను చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

బసవనగుడికి చెందిన 28 ఏళ్ల యువతికి బెంగుళూరుకు చెందిన యువకుడితో గతేడాది నవంబర్‎లో వివాహమైంది. భార్యభర్తలిద్దరూ హనీమూన్‌కు థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మందు తాగుతూ.. ఎంజాయ్ చేస్తూ హనీమూన్ గడిపారు. వారం తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చాక ఆ భర్తలోని రాక్షసుడు నిద్రలేచాడు. హనీమూన్‌లో భార్యను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటన్నింటిని ఆమె ముందు పెట్టి.. రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. అంతేకాకుండా.. ఆమెకు వచ్చే జీతం మొత్తం కూడా తనకే ఇవ్వాలని హుకూం వేశాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. భర్త ఆగడాలను భరించలేని ఆ భార్య.. బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‎లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మాయ మొగుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: ఏపీలోని ఆ గ్రామంలో నైటీలు వేసుకుంటే ఫైన్

Latest News

More Articles