Monday, May 13, 2024

అరవింద్ కేజ్రీవాల్‌ నా మాట వినలేదు

spot_img

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ నా మాట వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు రూపొందించాడని ఆరోపించారు. తన స్వలాభం కోసం పాలసీలు చేశారు కాబట్టి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్ట్ చేసిందన్నారు. అధికారం ముందు ఏదీ ప‌ని చేయ‌ద‌న్నారు. అరెస్టు జ‌రిగింద‌ని, చ‌ట్ట ప్ర‌కారం ఏది జ‌ర‌గాలో అది జ‌ర‌గుతుంద‌ని ఆయ‌న‌ అన్నారు.

2011లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్.. 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్య‌మంత్రి అయ్యారు.

కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ నేతల్లో ఆందోళన నెలకొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కావడం నేతలకు షాక్ ఇచ్చినట్టయ్యింది.

ఇది కూడా చదవండి: త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయొచ్చు..!

Latest News

More Articles