Thursday, May 2, 2024

రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం..వెంటనే దరఖాస్తు చేసుకోండి

spot_img

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే నోటిఫికేషన్‌ను ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) విడుదల చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా FLC కన్సల్టెంట్/కౌన్సిలర్, వాచ్‌మెన్/గార్డెనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు ఏప్రిల్ 18న ముగుస్తుంది.

తాజా రిక్రూట్‌మెంట్‌తో బ్యాంక్ ఆఫ్ బరోడా FLC కన్సల్టెంట్ ఒక పోస్ట్, వాచ్‌మెన్/గార్డెనర్ ఒక పోస్టు మొత్తంగా రెండు ఖాళీలను భర్తీ చేస్తుంది.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: FLC కౌన్సెలర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ లేదా సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. వాచ్‌మన్/గార్డెనర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 7వ తరగతి చదివి ఉండాలి.

వర్క్ ఎక్స్ పీరియన్స్: FLC కౌన్సెలర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్/ RRB / ప్రైవేట్ లిమిటెడ్‌లో కనీసం 5 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ (ఆఫీసర్ కేడర్) ఉన్న మాజీ బ్యాంక్ ఉద్యోగి అయి ఉండాలి. లేదా బ్యాంకింగ్ / సంబంధిత ఫీల్డ్‌లు, NBFCs/Flsలో కనీసం 5  ఏండ్ల అనుభవం తప్పనిసరి. లేదా బిజినెస్ కరస్పాండెంట్ / BC-కోఆర్డినేటర్‌గా కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

ఏజ్ లిమిట్: FLC కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 64 ఏళ్లలోపు ఉండాలి. వాచ్‌మన్/గార్డెనర్ పోస్టుకు వయసు 22 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విదానం: రిక్రూట్‌మెంట్ కోసం వచ్చిన దరఖాస్తులను బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

జీతభత్యాలు: FLC కన్సల్టెంట్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థి జీతం నెలకు రూ.18,000 లభిస్తుంది. వాచ్‌మన్/గార్డెనర్ పోస్ట్ కు రూ.6000 ఇస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులు ఉత్తరాఖండ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ:  ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక పోర్టల్ bankofbaroda.in ఓపెన్ చేయాలి. హోంపేజీలోకి వెళ్లి, ‘FLC కన్సల్టెంట్, వాచ్‌మన్/గార్డెనర్’ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి. తర్వాత  అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హత ఉన్న పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

ఆ తర్వాత  అప్లికేషన్‌ను ‘డైరెక్టర్, బరోడా స్వరోజ్‌గర్ వికాస్ సంస్థాన్, RSETI, బ్యాంక్ ఆఫ్ బరోడా, హోటల్ నరోత్తమ్ ఇన్, 1వ అంతస్తు, షీష్ మహల్, నైనిటాల్ రోడ్, హల్ద్వానీ జిల్లా, నైనిటాల్, ఉత్తరాఖండ్, పిన్ కోడ్ 263139’ అనే అడ్రస్‌కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: మ‌రో ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Latest News

More Articles