Friday, May 17, 2024

ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌

spot_img

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇవాళ(బుధవారం) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం రేపటి(గురువారం) నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహణ. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతొ ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పని సరైంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన చింతపండు నవీన్‌ ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. పోటీ చేయాలనున్న అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: సమ్మర్ ఎఫెక్ట్ :పోలింగ్‌ సమయం మరో గంట పెంచిన ఈసీ

Latest News

More Articles