Friday, May 17, 2024

మోడీ, రేవంత్‌రెడ్డి కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచారంపై నిషేధం

spot_img

ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడం జరిగిందన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ ప్రచార నిషేధం, ఓటుకి నోటు కేసుపై స్పందించిన ఆయన మోడీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీ లో వణుకు మొదలైందన్నారు జగదీష్ రెడ్డి.

కేసీఆర్ చేపట్టిన ఆరు యాత్రలతోనే  ఇద్దరి కాళ్ల కింద భూమి కంపిస్తుందన్నారు. ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకునేలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. కేసీఆర్‌ని అడ్డుకోవడంతో చేపట్టిన ప్రచారానికంటే ఎక్కువగా ప్రజా మద్దతు వస్తుందన్నారు.

రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలాడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో చర్చ మొదలైందన్న జగదీష్ రెడ్డి.. ఎన్ని నిషేధాలు పెట్టినా బీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: మన్నె క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం

Latest News

More Articles