Friday, May 17, 2024

దండకారణ్యంలో కాల్పులు.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు హతం.!

spot_img

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం అబూజ్ మడ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది గుర్తించారు. వారిలో ముగ్గురు తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ ఝిస్సు అలియాస్ చీమల నర్సయ్య, మంచిర్యాలకు చెందిన వినయ్ అలియస్ కేశబోయిన రవి, వరంగల్ కు చెందిన సుష్మిత ఉన్నట్లు గుర్తించారు. వీరు చాలా ఏళ్లుగా ఛత్తీస్ గఢ్ లో పనిచేస్తున్నారు.

స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196కేసులు ఉన్నాయి. ప్రభుత్వం ఆయనపై రూ. 25ల్షల రివార్డు కూడా ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై రూ. 8లక్షలు , సభ్యురాలైన సుష్మితపై రూ. 2లక్షల రివార్డు ఉంది. గత నెల 16న ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మొత్తం 29 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: మన్నె క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం

Latest News

More Articles