Monday, April 29, 2024

త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయొచ్చు..!

spot_img

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు.

ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన, తీసుకున్న వారిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు కూనంనేని. కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌ను అనేక బెదిరింపులు, వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. అయినా కూడా ఆయన లొంగకపోవడంతో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్వ్యం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని  బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.  సీఏఏ తీసుకొచ్చింది అందుకోసమేనని తెలిపారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందన్నారు. ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డిని జైల్లో వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని కాంగ్రెస్‌కు సూచించారు కూనంనేని సాంబశివరావు.

ఇది కూడా చదవండి: అక్రమాల నుండి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నారు

 

 

 

Latest News

More Articles