Sunday, May 19, 2024

ఖమ్మం ఆసుపత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు.. తెలంగాణ మరో జాతీయ రికార్డు

spot_img

ఖమ్మం ఆసుపత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్‌ సాధించిన ఆరో దవాఖానగా రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక అక్రిడిటేషన్లతో తెలంగాణ జాతీయ రికార్డు కొట్టేసింది. తల్లిపాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన కారణంగా ఖమ్మం జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ‘బేబీ/్రబెస్ట్‌ ఫీడింగ్‌ ్రఫెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌’ (బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్‌ మొదటి బీఎఫ్‌హెచ్‌ఐ సర్టిఫికెట్‌ సాధించింది. ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్‌, గజ్వెల్‌ ఏరియా హస్పిటల్‌, సూర్యాపేట ఎంసీహెచ్‌, జహీరాబాద్‌ ఏరియా హాస్పిటల్‌ ఈ గుర్తింపు పొందాయి.

తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేటెడ్‌ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ జాతీయ రికార్డు సాధించింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే మ్రురుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మ్రాతమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ర్రాష్ట ్రపభుత్వం తల్లిపాల వినియోగం, శిశు మరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఓవైపు ఎంసీహెచ్‌లు, ఎన్‌ఐసీయూలు వంటి సదుపాయాలు కల్పించింది. మరోవైపు ‘్రబెస్ట్‌ ఫీడింగ్‌ ్రపమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా’ సహకారంతో 30 మంది మాస్టర్‌ ట్రెయినీలకు శిక్షణ ఇప్పించింది.

Latest News

More Articles