Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్‌ కృషితోనే.. రాష్ట్రంలో సాగు పండుగ : మాజీ మంత్రి తుమ్మల

spot_img

కరువు కటకాలు.. ఆత్మహత్యలకు నెలవైన తెలంగాణ నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 24గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు బీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.1,300 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్‌ గోదావరి నీటితో ఇల్లందు నియోజకవర్గం సస్యశామలం అవుతుందని, బయ్యారం పెద్ద చెరువుకు సీతారామ నీటిని తీసుకొస్తామని తుమ్మల పేర్కొన్నారు.

Latest News

More Articles