Monday, May 20, 2024

ఢిల్లీ బిల్లు ఆమోదం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం.. పార్లమెంటులో కేకే ఫైర్

spot_img

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైసీపీ, బీజేడీ మద్దతు తెలుపడంతో పెద్దల సభలో ఈ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తూర్పారబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలు చేసే పార్లమెంట్‌కు కూడా కొన్ని పరిమితులు, పరిధులు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. సోమవారం ఢిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కేశవరావు మాట్లాడారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు. కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని.. కానీ ఆయన ప్రభుత్వంపై ఇలాంటి చర్యలు సరి కాదన్నారు. ఇలాంటి చట్టాల వల్ల ప్రజాస్వామ్యంపై ఆందోళన కలుగుతుందన్నారు. ఈ బిల్లు విషయమై కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తాము అతిక్రమించలేదన్నారు.

Latest News

More Articles